Chandrababu: మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపిన చంద్రబాబు కుటుంబం

షార్ట్స్‌లో చూడండి
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న పోరాటాలు కొనసాగుతున్నాయి. మందడంలో ఈ రోజు రైతులు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కుటుంబంతో పాటు నందమూరి కుటుంబసభ్యులు పలువురు మద్దతు తెలిపారు. రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.

రైతులకు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సంఘీభావం తెలిపారు. రాజధాని పోరాటంలో రైతులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు చెప్పారు. రైతులు ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Amaravati

More Telugu News