TRS: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు... టీఆర్ఎస్ ఖాతాలో పలు వార్డులు!

  • పరకాల మునిసిపాలిటీలో 22 వార్డులు
  • 11 వార్డుల్లో తిరుగులేని టీఆర్ఎస్
  • రాష్ట్రవ్యాప్తంగా 76 వార్డులు టీఆర్ఎస్ ఖాతాలో
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల సమరంలో పలు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, 11 వార్డులను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఏకగ్రీవాల్లో జోరును ప్రదర్శించింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్నటితో ముగియగా, మొత్తం 76 వార్డుల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచింది. ఇదే సమయంలో ఎంఐఎం అభ్యర్థులు మూడు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఈ నెల 22న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
TRS
Parakala
Unanimous

More Telugu News