గుంటూరు జిల్లాలో దారుణం.. సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన యువతి
- శుభకార్యంలో యువతికి మాయమాటలు
- మద్యం తాగించి సామూహిక అత్యాచారం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అక్కడామెకు మద్యం తాగించి ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బంధువుల ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధిత యువతి నీరసంగా ఉండడంతో ఆందోళన చెందిన బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి యువతిని మాచర్లలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిన్న ఆమె ప్రాణాలు విడిచింది.
యువతి శరీరంపై గాయాలను చూసి అనుమానించిన కుటుంబ సభ్యులు ఫంక్షన్లో ఏం జరిగిందో ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.