Australia: హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపేస్తున్న ఆస్ట్రేలియా అధికారులు

  • ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • వేల కిలోమీటర్లు వ్యాపించిన కార్చిచ్చు
  • తీవ్రస్థాయిలో నీటి కొరత
  • అధికంగా నీటిని తాగేస్తున్న ఒంటెలు
ఆస్ట్రేలియాలో ఈ వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా భగ్గుమంటోంది. కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాఫ్టర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. అయితే, జంతు సంరక్షణ కార్యకర్తలు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు.
Australia
Camels
Bushfire
Wildfire
Helicopters

More Telugu News