Telangana: టికెట్ ఇవ్వలేదని పార్టీ బ్యానర్ తో ఉరేసుకోబోయిన టీఆర్ఎస్ నేత

  • సూర్యాపేటలో ఘటన
  • 39వ వార్డు నుంచి టికెట్ ఆశించిన అబ్దుల్ రహీం
  • సుధారాణికి టికెట్ కేటాయించిన టీఆర్ఎస్ అధిష్ఠానం
తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. అయితే సూర్యాపేటలో ఓ టీఆర్ఎస్ నేత తనకు టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. సూర్యాపేటలోని 39వ వార్డు నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్ మైనారిటీ నేత అబ్దుల్ రహీం భావించారు. టికెట్ వస్తుందని చివరి నిమిషం వరకు నమ్మారు. ఆ నమ్మకంతోనే టికెట్ రాకముందే భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే, అదే వార్డు నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సుధారాణికి పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో అబ్దుల్ రహీం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో పార్టీ బ్యానర్ తోనే సీలింగ్ కు ఉరేసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. స్థానికులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది.
Telangana
Muncipal Elections
TRS
Suryapet
Abdul Rahim
Sudharani

More Telugu News