బాబాయ్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నాను: హీరో కల్యాణ్ రామ్
- 'మనం' చూశాక అలా అనిపించింది
- నా డ్రీమ్ ప్రాజెక్టు అదే
- బాబాయ్ ఆ మాట చెప్పారు
మా బాబాయ్ సపోర్ట్ నాకు మొదటి నుంచి వుంది. ఏ సీన్ అయినా టేక్ వన్ లోనే చేసేయాలి .. టేక్ టూ లోనే చేసేయాలి అనేవి పెట్టుకోకు. నీ మనసుకు నచ్చేంతవరకూ చేస్తూనే వుండు. చుట్టూ ఎంతమంది పబ్లిక్ వున్నా .. గొప్ప ఆర్టిస్టుల కాంబినేషన్ అయినా .. ఎవరు చూస్తున్నా నువ్వు సంతృప్తి చెందేవరకూ చేస్తూనే వుండు అని చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.