Telangana: దక్షిణ భారతదేశంలో ఉత్తమ కారాగారం చంచల్ గూడ

  • అవార్డులు ప్రకటించిన వెల్లూరు అకాడమీ ఆఫ్ ప్రిజన్స్
  • అవార్డును స్వీకరించిన జైళ్ల శాఖ డీజీ, చంచల గూడ జైలు సూపరింటిండెంట్
  • చర్లపల్లి జైలు ఖైదీల వ్యవసాయ క్షేత్రానికీ అవార్డు
హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉన్న చంచల్ గూడ సెంట్రల్ జైలుకు విశిష్ట పురస్కారం దక్కింది. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ జైలుగా చంచల్ గూడ అవార్డు అందుకుంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఇటీవలే ఈ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ ఎమ్మార్ భాస్కర్, చంచల్ గూడ జైలు సూపరింటిండెంట్ డి. శ్రీనివాస్ వెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును స్వీకరించారు. అంతేకాదు, ఓపెన్ ఎయిర్ జైలు విభాగంలో చర్లపల్లి జైలులోని ఖైదీల వ్యవసాయ క్షేత్రానికి కూడా అవార్డు లభించింది.
Telangana
Chanchalguda
Prison
Jail
Award
Tamilnadu
Vellore

More Telugu News