Kalyan Ram: మా నాన్నగారి నుంచి అదే నేర్చుకున్నాను: హీరో కల్యాణ్ రామ్

  • తాతగారు మాకు ఇచ్చిన అసలైన ఆస్తి అదే
  • ఇంటిపేరుకు మచ్చ తీసుకురాను 
  • నాన్నగారు ముక్కుసూటి మనిషి
నటుడిగా .. నిర్మాతగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

'నందమూరి' అనే ఇంటిపేరును మా తాతగారు మాకు ఇచ్చారు. ఆ పేరుకు మచ్చ తీసుకురాకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నా పనులు చేసుకుంటూ వెళుతుంటాను .. నా నిర్ణయాలు తీసుకుంటూ వుంటాను. ఇక మా నాన్నగారి విషయానికొస్తే ఆయన ముక్కుసూటి మనిషి. విషయమేదైనా వుంటే ఆయన ముఖం మీదే చెప్పేస్తారు. వెనక మాట్లాడటం అనేది ఆయనకి అలవాటే లేదు. ఎదుటి వ్యక్తి తీరు నచ్చకపోతే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతారేగానీ, పక్కకి వెళ్లి మాట్లాడటం అనేది ఆయనకి తెలియదు. ఆయన నుంచి నేను కూడా అదే నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Kalyan Ram
Ali

More Telugu News