Cricket: భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే:టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

  • డే అండ్ నైట్ మ్యాచ్
  • మంచు కురిసే అవకాశంతో బ్యాటింగ్ కష్టం?
  • రెండో సారే బ్యాటింగ్ తేలికన్న కోహ్లీ

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. డే నైట్ లో సాగనున్న ఈ మ్యాచ్ లో రాత్రి పూట మంచు కురిసే అవకాశముంది. రాత్రి బ్యాటింగ్ చేసే జట్టుకు కొంచెం కష్టమే అయినప్పటికీ.. ఆసీస్ బౌలింగ్ ఎంచుకొని సాహసం చేసిందనే చెప్పాలి.

 భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్ ఆరోన్ ఫించ్(కెప్టెన్) మార్నస్ లబుచాంజె, స్టీవెన్ స్మిత్, అస్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ, ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కానె రిచర్డ్ సన్, అడం జంపా
 

More Telugu News