cpm: ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు మంచిది కాదు: సీపీఎం నేత మధు

  • అమరావతిని రాజధానిగా ఆనాడు పార్టీలన్నీ అంగీకరించాయి
  • దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు
  • మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలి
  • రైతులపై పోలీసుల నిర్బంధాన్ని తక్షణమే ఆపాలి
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు మంచిది కాదని సీపీఎం నేత మధు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆయన స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. అమరావతిలో రాజధానిని ఆనాడు పార్టీలన్నీ అంగీకరించాయని ఆయన గుర్తు చేశారు.

ఈ రోజు మధు మీడియాతో మాట్లాడుతూ.. 'వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతిలో రాజధానికి అంగీకారం తెలిపాయి. దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలి. రైతులపై పోలీసుల నిర్బంధాన్ని తక్షణమే ఆపాలి. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం మంచిది కాదు' అని వ్యాఖ్యానించారు.
cpm
Amaravati
Andhra Pradesh

More Telugu News