Nara Lokesh: ప్రభుత్వ పెద్దల అహంకారం ఈ భోగి మంటల్లో దహించుకుని పోవాలి: లోకేశ్

  • భోగి మంటల్లో పనికిరాని వాటిని వేస్తాం
  • ఇంటికి కొత్త వెలుగులు తెచ్చుకోవాలని అనుకుంటాం
  • ఈ వైసీపీ ప్రభుత్వం కూడా పనికిమాలింది
  • ప్రజలకు ఎలాంటి సంతోషాలను అందించలేదు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఎలాంటి సంతోషాలను అందించలేని పనికిమాలిన ప్రభుత్వమని ట్వీట్ చేశారు. భోగి సందర్భంగా వైసీపీ నేతలకు మంచి ఆలోచనలు కలగాలని లోకేశ్‌ అన్నారు.

'భోగి మంటల్లో పనికిరాని వాటిని వేసి ఇంటికి కొత్త వెలుగులు తెచ్చుకోవాలని అనుకుంటాం. ప్రజలకు ఎలాంటి సంతోషాలను అందించలేని ఈ పనికిమాలిన ప్రభుత్వ పెద్దల అహంకారం ఈ భోగి మంటల్లో దహించుకుపోయి ప్రజలకు మంచి చేసే  ఆలోచనలు వారిలో కలగాలని కోరుకుంటున్నాను' అని నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతి రాజధానితో పాటు పలు విషయాల్లో వైసీపీ సర్కారు ప్రదర్శిస్తోన్న తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News