నటి నందితా శ్వేతకు అసభ్య మెసేజ్ లు... 'అమ్మానాన్నలు లేరా?' అంటూ ఘాటు కౌంటర్!
- చెప్పలేని భాషలో వేధింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు
- వ్యవహారం సద్దుమణిగి వేధింపులు ఆగాలన్న నందిత
వీరి మెసేజ్ లను చూసి తట్టుకోలేకపోయిన నందితా శ్వేత, విషయాన్ని స్వయంగా మీడియా ముందు వెల్లడించి, వాపోయింది. ముఖ్యంగా వాంజి సెలియన్ అనే యువకుడి నుంచి వస్తున్న మెసేజ్ లు చూసి తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.
అతనికి అమ్మానాన్నలు లేరా? అని మండిపడింది. వారికీ కుటుంబం ఉంటుందని, ఇటువంటి వ్యక్తులకు ఏం చేస్తే బుద్ధి వస్తుందని ఘాటు కౌంటర్ ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం తన ఉద్దేశం కాదని అంది. పోలీసుల వరకూ వెళితే, మరింత రచ్చ అవుతుందని, ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణగాలన్నదే తన అభిమతమని చెప్పింది. కాగా, ప్రస్తుతం నందితా శ్వేత తమిళంలో' తానా', తెలుగులో 'అక్షర', 'ఐపీసీ 376' సినిమాల్లో నటిస్తోంది.