Vijay Sai Reddy: ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు: విజయసాయిరెడ్డి
- అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు
- ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు
- బంగారు నగల సేకరణకు దిగారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
'అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరా తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.