Roja: ఎవ్వరూ జగన్ ను అడ్డుకోలేరు: రోజా

  • రాజధాని మార్పును ఎవరూ ఆపలేరు
  • అధికారంలోకి వచ్చాక సంబరంగా తొలి సంక్రాంతి
  • చంద్రబాబులో తప్ప అందరిలో సంతోషమేనన్న రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు అడ్డుకోలేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని మార్పును ఏ పార్టీ కూడా ఆపలేదని ఆమె అన్నారు. గడచిన పదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

పండగకు దూరంగా చంద్రబాబు ఉండటమన్నది ఓ నాటకమని, తన స్వగ్రామం నారా వారి పల్లెకు ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. 2020లో చంద్రబాబు తప్ప, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ భోగి మంటల్లో చెడు ఆలోచనలు ఉన్నవాళ్లనీ, చెడును తగులబెట్టేస్తున్నామని ఆమె అన్నారు. ఇకపై కొత్త సంతోషాలు, కొత్త ఆశయాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని రోజా అభిప్రాయపడ్డారు. 
Roja
Sankranti
Chandrababu
Nagari

More Telugu News