Janagoan: టీవీ చూసే విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ.. మనస్తాపంతో అక్క ఆత్మహత్య

  • జనగామ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న యువతి
  • సంక్రాంతి సెలవులకు ఇంటికి
  • చెల్లెలితో గొడవ పడి క్షణికావేశంలో ఆత్మహత్య
సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ విద్యార్థిని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంది. సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన యువతి (19) జనగామలోని వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. హాస్టల్‌కు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇటీవల ఇంటికి వచ్చింది.

టీవీ చూసే విషయంలో ఆదివారం అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్క ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Janagoan
Hyderabad
girl
suicide

More Telugu News