Kodali Nani: సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త హరిదాసు చంద్రబాబు: మచిలీపట్నం ర్యాలీలో కొడాలి నాని

  • మచిలీపట్నంలో భారీ ర్యాలీ
  • మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ
  • హాజరైన కొడాలి నాని
విపక్షనేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మవద్దని, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు చేస్తే అభివృద్ధి చెందేది ఒక్క ప్రాంతమేనని, అదే డబ్బుతో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చని అన్నారు.

హైదరాబాద్ ను కూడా తానే నిర్మించానని సిగ్గులేకుండా చెబుతున్నాడని, ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త హరిదాసు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా మచిలీపట్నంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జోలె పట్టడాన్ని ఉదహరిస్తూ కొడాలి నాని సెటైర్ వేసినట్టు అర్థమవుతోంది.
Kodali Nani
Andhra Pradesh
Amaravati
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News