Andhra Pradesh: ఏపీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీ నిర్ణయం!
- ఢిల్లీలో మకాం వేసిన పవన్
- బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం తీవ్ర యత్నాలు
- దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్!
- ఎట్టకేలకు జేపీ నడ్డాతో సమావేశం
జనసేనాని పవన్ కల్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీలో మకాం వేసి బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. నిన్న అమిత్ షా అపాయింట్ మెంట్ దొరక్క ఇబ్బంది పడిన పవన్ ఇవాళ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఏపీలో రాజధాని ఉద్యమం, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారిన నేపథ్యంలో కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇకపై ఉమ్మడి కార్యాచరణ మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని రెండు పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు జనసేనకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇది నిస్సందేహంగా ఆసక్తికర పరిణామమే.