kusuma jagadish: పారిశుద్ధ్య కార్మికులకు ములుగు జెడ్పీ చైర్మన్ పాదాభివందనం

  • పారిశుద్ధ కార్మికులు దేవుళ్లతో సమానం
  • ముగిసిన రెండో విడత ‘ పల్లె ప్రగతి’    
  • పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కుసుమ జగదీశ్
ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ వార్తల్లో నిలిచారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపించారు. ములుగులో నిర్వహించిన గ్రామసభలో పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించిన అనంతరం, మోకాళ్లపై కింద కూర్చుని తన తలను నేలకు ఆనించి వాళ్లకు పాదాభివందనం చేశారు. చెత్తాచెదారాన్ని, వ్యర్థాలను ఎత్తి పారబోస్తున్న పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని కొనియాడారు.
kusuma jagadish
mulugu
zp chairman

More Telugu News