Galla Jaydev: రాజధాని రైతుల కోసం తెనాలిలో జోలె పట్టిన గల్లా జయదేవ్

  • కొనసాగుతున్న రాజధాని ఉద్యమం
  • విరాళాలు సేకరిస్తున్న నేతలు
  • తెనాలిలో పర్యటించిన గల్లా జయదేవ్
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన ఇవాళ తెనాలిలో రాజధాని కోసం ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి తెనాలి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దీనిపై గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం 27 రోజులుగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెనాలిలో జోలె పట్టినట్టు వివరించారు. మేము సైతం అంటూ తెనాలి పుర ప్రజలు పెద్ద ఎత్తున కదలి వచ్చి విరాళాలు అందజేశారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Galla Jaydev
Andhra Pradesh
Amaravati
Telugudesam
Tenali

More Telugu News