Nara Lokesh: ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న మీరు స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతున్నారు: లోకేశ్

  • మహిళలపై కక్ష సాధింపు మంచిది కాదు
  • తప్పు చేసి మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నారు 
  • మహిళలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదా? 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడితే మహిళల పాస్ పోర్ట్ రద్దు చేయిస్తారా? మరీ అంత దిగజారిపోయారా జగన్ గారు? 500 మంది మహిళల మీద కేసులా? 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా?' అని విమర్శలు గుప్పించారు.

'శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని నిలదీసినందుకు మహిళల వివరాలు పాస్ పోర్ట్ కార్యాలయానికి పంపించడం మీ భయానికి నిదర్శనం. మహిళలపై కక్ష సాధింపు మంచిది కాదు జగన్ గారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
 
'తప్పు చేసి మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న మీరు స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతున్నారు. మహిళలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదా?' అని లోకేశ్ ప్రశ్నించారు.
Nara Lokesh
Andhra Pradesh
Amaravati

More Telugu News