Vijay Sai Reddy: ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయిన చంద్రబాబు ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట: విజయసాయిరెడ్డి

  • సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునే సంప్రదాయం తమతోనే మొదలైందన్నాడు
  • ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష
  • గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. అమరావతిలో జరుగుతోన్న పరిణామాలకు నిరసనగా తమ కుటుంబం ఈ సారి సంక్రాంతి పండుగ చేసుకోదని చంద్రబాబు తెలిపిన విషయం తెలిసిందే.

'సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపుకునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయి ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
Vijay Sai Reddy
Amaravati
Andhra Pradesh
YSRCP

More Telugu News