Mangalagiri: వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్!

  • అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ప్రదర్శన
  • పెనుమాక నుంచి భారీ ర్యాలీ
  • అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజధానిగా అమరావతి వద్దని, అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని చెబుతూ, మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఈ ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత విగ్రహం వరకు భారీ ర్యాలీ తలపెట్టగా, పోలీసులు అరెస్ట్ చేశారు.

భారీ సంఖ్యలో ప్రజలు, తన మద్దతుదారులతో ఆయన బయలుదేరగా, ఈ ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తొలుత హెచ్చరించారు. ఆపై నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన వారిలో పలువురు మహిళలు, స్థానిక వైసీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Mangalagiri
MLA
Alla Nani
Arrest

More Telugu News