Prudhvi Raj: పృథ్వీరాజ్ పై వేటు..ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు

  • ఆడియో టేపుల వ్యవహారంలో పృథ్వీరాజ్ పై ఆరోపణలు
  • సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • పృథ్వీని రాజీనామా చేయాలని సుబ్బారెడ్డి ఆదేశాలు
ఆడియో టేపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై వేటు పడింది. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకెళ్లారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీని వెంటనే రాజీనామా చేయాలని జగన్ నిర్దేశించారు. ఈ ఆదేశాల మేరకు వెంటనే రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ కు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కాగా, టేపుల వ్యవహారం ఘటనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయి విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.
Prudhvi Raj
svbc
Yv subba reddy
cm
jagan

More Telugu News