Telangana: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. పలు జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం

  • పలు జిల్లాల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే
  • మరికొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
  • దుండిగల్ లో 26వ వార్డు, పరకాలలో నాలుగు వార్డులు ఏకగ్రీవం
తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడక మాదిరే ఉంది. మరికొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో 26వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి శంభీపూర్ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా, వరంగల్ రూరల్ పరకాల మున్సిపాలిటీలో 8వ వార్డు అభ్యర్థి అడపరాము, 17వ వార్డు అభ్యర్థి పాలకుర్తి గోపి, 16వ వార్డు అభ్యర్థి బండి రమాదేవి,20వ వార్డు అభ్యర్థి సోద అనిత ఏకగ్రీవమయ్యారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో 23వ వార్డు అభ్యర్థి పుప్పాల ఉమాదేవి, రాజన్న సిరిసిల్లలో 34వ వార్డు అభ్యర్థి దార్ల కీర్తన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Telangana
Minicipal Elections
TRS
Unanimous

More Telugu News