Amaravati: మహిళలు పడ్డ ఇబ్బందులను మహిళా కమిషన్ కు వివరించాం: ఎంపీ కేశినేని నాని

  • మహిళా కమిషన్ కు 500 వీడియోలు, 1000 ఫొటోలు అందజేశాం
  • మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా
  • ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
రాజధాని ప్రాంతంలో పోలీసుల తీరు కారణంగా మూడు వేల మంది మహిళలు పడ్డ ఇబ్బందులను జాతీయ మహిళా కమిషన్ కు వివరించామని టీడీపీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులను ఆయన కలిశారు. రాజధానిలో మహిళలపై జరిగిన దాడి, మూడు రాజధానుల అంశంపై ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 500 వీడియోలు, 1000 ఫొటోలను కమిషన్ సభ్యులకు అందజేశామని, మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారని, పోలీసుల తీరు అర్థం కావడం లేదని, అధికారంలో ఎవరున్నా వారి తీరు మారకూడదని సూచించారు. మహిళలతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని మహిళలపై దాడి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
Amaravati
MP
Kesineni Nani
Mahila commission

More Telugu News