Thammineni Seetharam: వికేంద్రీకరణ జరగకపోవడం వల్లే కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది: తమ్మినేని
- పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి
- వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయని వ్యాఖ్యలు
- చంద్రబాబు వైఖరి ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రాంతీయ అసమానతల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ్మినేని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, అయితే ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. నాడు వికేంద్రీకరణ జరగకపోవడం వల్లే కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని అన్నారు. ఉత్తరాంధ్ర వలసలు ఆగాలంటే వికేంద్రీకరణ వల్లే సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. తాను రాజకీయంతో మాట్లాడడంలేదని, రాజధానుల కోసమే మాట్లాడుతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. రాజధానిపై చంద్రబాబు వైఖరి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.