సెల్ ఫోన్ పరిచయం... హైదరాబాద్ యువతికి వేధింపులు... అరెస్ట్ చేసిన పోలీసులు!
- బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్
- ప్రేమ పేరిట వేధింపులు
- రిమాండ్ కు తరలించిన పోలీసులు
ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన అతను, తనను కలవాలని, లేకుంటే ఆఫీసుకు వచ్చి గొడవ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె, ఓ పార్కులో అతన్ని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.
10వ తేదీన ఆఫీసు వద్దకు వచ్చిన ప్రశాంత్, తోటి ఉద్యోగుల ముందు మరోసారి వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.