Posani Krishna Murali: పోసాని, నేను అన్మదమ్ముల్లాంటి వాళ్లం: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్

  • మా మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది
  • పోసాని నుంచి నేను ఎంతో నేర్చుకున్నా
  • మా ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండాలి
రాజధాని రైతుల అంశానికి సంబంధించి వైసీపీ నేతలు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ లు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ మరోమారు స్పందించారు. పోసాని, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, తమ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. పోసాని నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ‘పోసానిది మాట తప్పని.. మడమ తిప్పని నైజం’ అని ప్రశంసించిన పృథ్వీరాజ్, తమ మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండాలని, ఆయన ఆశీర్వాదం తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకున్నారు. రైతులను తాను ఒక్క మాట కూడా అనలేదని, చంద్రబాబు బినామీలను మాత్రమే తాను విమర్శించానని పృథ్వీ తెలిపారు.
Posani Krishna Murali
Prudhvi Raj
svbc
chairman

More Telugu News