Chandrababu: చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు 'చిట్టి నాయుడే' అయి ఉంటాడు: విజయసాయిరెడ్డి
- గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా వెళ్లారు
- ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథ గుర్తు కొస్తోంది
- తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపలేదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధాని విషయంలో వారి తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
'చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథ గుర్తు కొస్తోంది. తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.