Kolkata: రేపు ఒకే వేదికపై కనపడనున్న మోదీ, మమత బెనర్జీ

  • కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాలకు మోదీ, మమత
  • నేడు, రేపు పశ్చిమ బెంగాల్‌లో మోదీ పర్యటన
  • ఇటీవల మోదీ ప్రభుత్వంపై మమత తీవ్ర విమర్శలు
  • ఒకే వేదికపై కనపించనుండడంతో ఆసక్తి
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఒకే వేదికపై కనపడనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వార్షికోత్సవాల సందర్భంగా రేపు ఓ భారీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉంది. అలాగే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొంటారని తెలిసింది.

నేడు, రేపు ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. పోర్టు ట్రస్ట్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని ఇప్పటికే ప్రకటన వెలువడింది. పోర్టు వార్షికోత్సవాలకు మమత బెనర్జీని కూడా ఆహ్వానించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మమత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, మమత ఒకే వేదికపై కనిపిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.
Kolkata
West Bengal
Narendra Modi
mamara banerjee

More Telugu News