cm: వైఎస్ జగన్ గారూ! మహిళలను నిర్బంధిస్తారా? సిగ్గు లేదా?: నారా లోకేశ్ ఫైర్

  • మహిళలపై ప్రతాపం చూపుతారా?
  • సాయంత్రం 6 తర్వాత కూడా వారిని నిర్బంధిస్తారా?
  • పెద్ద ఎత్తున మహిళలను జైళ్లల్లో పెట్టిన తొలి సీఎం జగన్
రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ యోచనను నిరసిస్తూ విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. మహిళలపై ప్రతాపం చూపించడమేంటి? సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా మహిళలను నిర్బంధిస్తారా? సిగ్గు లేదా?’ అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలను జైళ్లల్లో పెట్టిన తొలి ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
cm
ys jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News