Minister: గతంలో అమరావతి కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయి?: ఏపీ మంత్రి కన్నబాబు

  • మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు
  • లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టిస్తున్నారు
  • జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చిస్తున్నాం
గతంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసమని విరాళాలు సేకరించారని, ఇప్పుడు మళ్లీ విరాళాలు సేకరిస్తున్నారంటూ టీడీపీపై మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు.

గతంలో అమరావతి కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, లేనిపోని అపోహలు కల్పించి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికల గురించి ప్రస్తావించారు. ఈ నివేదికలపై చర్చిస్తున్నామని చెప్పారు.
Minister
Kannababu
Chandrababu
Telugudesam

More Telugu News