చాలా వారాల తరువాత నేడు కోర్టుకు జగన్... మరో కేసులో విజయమ్మ, షర్మిల కూడా!
- అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణ
- సీఎం అయిన తరువాత కోర్టుకు రాని జగన్
- మినహాయింపు లేదని స్పష్టం చేసిన కోర్టు
సీఎం హోదాలో కోర్టుకు రావాలంటే, భద్రతా కారణాలు, బందోబస్తు ఖర్చులను కారణాలుగా చూపుతూ, జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించగా, న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆయన నేడు కోర్టుకు హాజరు కానున్నారు.
ఇదే సమయంలో యాదృచ్చికంగా, నేడే వైఎస్ విజయమ్మ, షర్మిలలు మరో కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో... అంటే 2012లో అనుమతులు లేకుండా వరంగల్ జిల్లా పరకాలలో సభ నిర్వహించడం ద్వారా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని వీరిపై కేసు నమోదైంది.
ఈ కేసులో వారు ఇంతవరకూ విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి సమన్లు జారీ కాగా, నేడు కోర్టుకు హాజరు కావాల్సి వుంది. ఇదే కేసులో కొండా మురళి, కొండా సురేఖ దంపతులు కూడా కోర్టుకు రానుండడంతో, రెండు కోర్టుల వద్దా భద్రతను కట్టుదిట్టం చేశారు.