union minister of state: 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారికే భారత పౌరసత్వం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
భారత్ లోకి వచ్చిన శరణార్థులను ఆదుకోవడానికి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ఒక్క అక్షరం తప్పున్నా మార్చడానికి సిద్ధమని చెప్పారు. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్ లోకి వచ్చిన వారికే పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు.

ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించారన్నారు. ఈ చట్టాన్ని అన్ని రకాలుగా ఆలోచించే తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్క కులం, మతం, వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించలేదని స్పష్టం చేశారు. సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
union minister of state
Kishan Reddy
CAA
Hyderabad

More Telugu News