nirbhay: సుప్రీంను ఆశ్రయించిన నిర్భయ్ దోషి వినయ్ శర్మ

  • క్యురేటివ్ పిటిషన్ దాఖలు
  • ఉరిశిక్ష పడిన దోషులకు న్యాయపరంగా ఇది చివరి అవకాశం
  • ఇప్పటికే 22న ఉరితీయాలని డెత్ వారెంటు జారీ

డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ నిర్భయ్ కేసు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఈరోజు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరోసారి తన కేసు పరిశీలించాలన్న విజ్ఞప్తి ఇది. ఉరిశిక్ష పడిన వారికి న్యాయపరంగా ఉన్న చివరి అవకాశం. దీనిపై న్యాయమూర్తులు తమ చాంబర్ లోనే విచారణ జరుపుతారు.

కాగా, ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు నిర్బయ్ దోషులు నలుగురికీ ఉరిశిక్ష వేయాలని ఢిల్లీలోని పటియాల కోర్టు డెత్ వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైల్లో దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే న్యాయపరంగా తనకు ఉన్న చివరి అవకాశాన్ని వినయ్ శర్మ ఇప్పుడు వినియోగించుకుంటున్నాడు. అలాగే, ఉరి శిక్ష అమలయ్యేలోగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా కోర్టు ఇవ్వడంతో అందుకోసం దోషుల తరపు న్యాయవాదులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

nirbhay
convicts
vinaysarma
kuretive pition

More Telugu News