Devineni Uma: చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డ సంగతి మర్చిపోవద్దు: కొడాలి నానికి దేవినేని ఉమ కౌంటర్

  • చంద్రబాబును విమర్శించడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనం
  • జగన్ మనసులోని భావాలను కొడాలి నాని బయటకు చెబుతున్నారు
  • జగన్ కు దమ్ముంటే అమరావతిలో పాదయాత్ర చేయాలి
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డ విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. జగన్ మనసులోని భావాలనే కొడాలి నాని బయటకు చెబుతున్నారని అన్నారు. రాజధాని గ్రామాల్లో దమ్ముంటే పాదయాత్ర చేయాలని జగన్ కు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ పతనానికి నిన్ననే నాంది పడిందని చెప్పారు
Devineni Uma
Kodali Nani
Jagan
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News