Loksatta: ఎన్నికల్లో ధన ప్రవాహం ఆపాలి: 'లోక్ సత్తా' జేపీ

  • డబ్బులు పంచకుండా ఓట్లను ఆశించే పరిస్థితి లేదు
  • డబ్బులివ్వడమనేది ఎంట్రెన్స్ ఫీజులా మారింది
  • ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలు
ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ఓట్లను ఆశించే పరిస్థితి లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగటం లేదన్నారు. డబ్బులివ్వడమనేది ఎంట్రెన్స్ ఫీజులా మారిందని అభివర్ణించారు. ఈ రోజు జేపీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల భారాన్ని తగ్గించడంపై రేపు, ఎల్లుండి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికలకోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో స్థానిక  ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని పేర్కొన్నారు.
Loksatta
Jayaprakash Narayan
Elections
Money

More Telugu News