ఎన్నికల్లో ధన ప్రవాహం ఆపాలి: 'లోక్ సత్తా' జేపీ
- డబ్బులు పంచకుండా ఓట్లను ఆశించే పరిస్థితి లేదు
- డబ్బులివ్వడమనేది ఎంట్రెన్స్ ఫీజులా మారింది
- ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలు
ఎన్నికలకోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని పేర్కొన్నారు.