Narendra Modi: అక్కడ ఏం జరిగిందన్న విషయం తర్వాత చెబుతాను: మోదీ, అమిత్ షాలతో భేటీపై మోహన్ బాబు

  • భారతదేశానికి ప్రధాని మోదీ అవసరం
  • అమిత్ షా కూడా గొప్ప వ్యక్తి
  • వాళ్లను కలిసిన అనుభూతి మరపురానిది
ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు మరోమారు ప్రశంసలు కురిపించారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీని, అమిత్ షాను ఇటీవల కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

భారతదేశానికి ప్రధాని మోదీ అవసరం అని, అద్భుతమైన పీఎం అని కొనియాడారు. అలాగే, అమిత్ షా కూడా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. మోదీ, అమిత్ షాలను కలిసిన అనుభూతి మరపురానిదని, అక్కడ ఏం జరిగిందన్న విషయం తర్వాత చెబుతానని అన్నారు. దేశాన్ని ఎలా కాపాడుకావాలో తెలిసిన నిజమైన ప్రధాని మోదీ అని, డెబ్బై ఏళ్లలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని అన్నారు.
Narendra Modi
Amithshah
Artist
Mohanbabu

More Telugu News