Andhra Pradesh: అసాంఘిక శక్తులు పోలీసులపై దాడులకు దిగుతున్నాయి: తీవ్రంగా స్పందించిన గుంటూరు రేంజి పోలీసులు

  • ఎమ్మెల్యే గన్ మన్ పై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు
  • అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • అయినా ఓర్పుతో విధులు నిర్వహిస్తున్నామని వెల్లడి
ఏపీ రాజధాని విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో గుంటూరు రేంజ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. అసాంఘిక శక్తులు పోలీసులపైనా దాడులకు దిగుతున్నాయని, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఓర్పుతో విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయం పేర్కొంది. ఎమ్మెల్యే గన్ మన్ పై దాడి చేసిన ఘటనలో కొందరిపై కేసు నమోదు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు ధ్వంసం చేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
Andhra Pradesh
Amaravati
AP Capital
Police
Telugudesam
YSRCP

More Telugu News