Australia: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రభావం... 10 వేల ఒంటెలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం

  • ఆస్ట్రేలియాను దహిస్తోన్న కార్చిచ్చు
  • నీటి కోసం జనావాసాలపై పడుతున్న ఒంటెలు
  • బెంబేలెత్తిపోతున్న ప్రజలు
అతిపెద్ద ద్వీప దేశంగా పేరుగాంచిన ఆస్ట్రేలియా ఇప్పుడు కార్చిచ్చు కారణంగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంది. అత్యధిక శాతం భూభాగాన్ని కార్చిచ్చు దహించివేసింది. మిగతా ప్రాంతాలకు కూడా పాకుతుండడంతో ప్రజలు లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు బీచ్ లలో వంటావార్పు చేసుకుంటూ అక్కడే కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సుమారు 10 వేల ఒంటెలను చంపాలని కీలక నిర్ణయం తీసుకుంది.

కార్చిచ్చు కారణంగా వేడిని భరించలేక ఒంటెలు జనావాసాల్లోకి చొరబడి అధికంగా నీటిని తాగేస్తుండడంతో వాటిని హతమార్చాలని భావిస్తున్నారు. పైగా ఒంటెలు ఇళ్లకు వేసిన ఫెన్సింగ్ లను సైతం ధ్వంసం చేస్తూ నీటి వనరులను పాడుచేస్తున్నాయి. అంతేకాదు, నీళ్ల కోసం ఇళ్లకు అమర్చిన ఏసీలను సైతం ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా జరిగాయి. ప్రజల కనీస అవసరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యాలు, భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న ఆస్ట్రేలియా సర్కారు ఒంటెలను చంపేందుకు హెలిక్టార్లను కూడా ఏర్పాటు చేసింది.
Australia
Bushfire
Wildfire
Camels
Island Nation

More Telugu News