Telugudesam: రైతుల మరణాన్నీ అపహాస్యం చేసే నీచ సంస్కృతి వైసీపీది: నారా లోకేశ్

  • ‘అమరావతి డెడ్ బాడీస్ అసోసియేషన్’ ‘చంద్రన్న బీమా’ అంటూ పోస్టింగ్
  • వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంత నీచానికైనా దిగజారుతుంది
  • దేనినైనా మార్ఫింగ్ చేస్తారు
టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ‘చంద్రన్న బీమా’ను కించపరిచేలా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘అమరావతి డెడ్ బాడీస్ అసోసియేషన్’ ‘చంద్రన్న బీమా’ అంటూ మార్ఫింగ్ చేసిన ఓ ప్రకటనపై లోకేశ్ మండిపడ్డారు. రైతుల మరణాన్ని కూడా అపహాస్యం చేసే నీచ సంస్కృతి వైసీపీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వేసే ఐదు రూపాయల ముష్టి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంత నీచానికైనా దిగజారుతుందని, దేనినైనా మార్ఫింగ్ చేస్తారని విమర్శించారు.
Telugudesam
Nara Lokesh
chandranna beema

More Telugu News