Vijay Sai Reddy: రాష్ట్రంలో అస్థిరత్వం సృష్టించడానికి చంద్రబాబు చేసిన మరో ప్రయత్నమే ఇది: విజయసాయిరెడ్డి

  • ఏపీ రాజధాని అమరావతిలో ఉద్రిక్తత
  • రైతుల ఆందోళన తీవ్రతరం
  • చినకాకాని వద్ద పిన్నెల్లిపై దాడి
ఏపీ రాజధాని రగులుతోంది. ఓవైపు రైతుల ఆందోళనలు, మరోవైపు అరెస్టులతో అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. ఈ మధ్యాహ్నం ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆందోళనకారులు చినకాకాని వద్ద దాడికి యత్నించిన ఘటన అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పిన్నెల్లిపై టీడీపీ గూండాలు పిరికిపందల్లా దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఈ దాడికి పాల్పడింది టీడీపీ గూండాలైతే, ఆ నిందను అమాయక రైతులపై మోపడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్తతను, అస్థిరతను సృష్టించేందుకు చంద్రబాబు చేసిన మరో ప్రయత్నమే ఇది అని విజయసాయి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Andhra Pradesh
Amaravati
Pinnelli
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News