Hruthik Roshan: మాజీ భార్యతో హృతిక్ రోషన్ చెట్టపట్టాలు... వైరల్ అవుతున్న ఫొటోలు!

  • చానాళ్ల క్రితమే సుజానేతో హృతిక్ విడాకులు
  • తాజాగా బంధువులతో కలిసి మంచుకొండల్లో విహారం
  • ఫొటోలను పంచుకున్న సుజానే ఖాన్
తన మాజీ భార్య సుజానే ఖాన్ కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మళ్లీ దగ్గరవుతున్నాడా? ఈ ఫొటోలు చూస్తే అవుననక తప్పదు. సుజానేతో కలిసి, హృతిక్ మంచుకొండల్లో ఇప్పుడు విహరిస్తున్నాడు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి వీరిద్దరూ విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలే అయింది. అయినా, ఇప్పుడు తమ పిల్లలు  హ్రీహాన్, హిృదాన్ లతో పాటు తల్లిదండ్రులు రాకేశ్ రోషన్, పింకీ, సోదరి సునయన, మేనకోడళ్లు ఎహసాన్, పష్మీనాలతో కలిసి హృతిక్ విహార యాత్రలో ఉన్నారు. కొత్త సంవత్సరం కొత్త బంధాలతో చిరునవ్వు నిండిన మనసుతో తాము మంచు కొండల్లో ఆనందంగా గడుపుతూ ఉన్నామని సుజానే, తన భర్తతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవిప్పుడు వైరల్ అవుతుండగా, నెట్టింట తెగ లైక్ లను, కామెంట్లనూ తెచ్చుకుంటున్నాయి.
Hruthik Roshan
Sujane Khan
Snow
Viral Pics

More Telugu News