Prime Minister: మోదీని కలవడంలో రాజకీయ కారణాలు లేవు: మంచు లక్ష్మి

  • ఇటీవల మోదీని  పాన్ ఇండియా సినీ నటులు కలిశారు
  • దక్షిణాది సినీ ప్రముఖులకు అవకాశమివ్వాలని కోరాను
  • ఈ మేరకు మోదీ నుంచి మాట తీసుకున్నా
ఢిల్లీలో ప్రధాని మోదీని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి మోహన్ బాబుకు ఆహ్వానం అందిందని, అందుకే, మోదీని కలిశారంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందించింది. మోదీని తాము కలవడం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని స్పష్టం చేసింది. రెండోసారి ప్రధాని అయిన మోదీని ఇటీవల పాన్ ఇండియా సినీ నటులందరూ కలిసి అభినందించిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ రోజున మోదీని కలిసే అవకాశం కొంతమంది నటులకే దక్కిందని, ఇప్పుడు దక్షిణాది సినీ రంగ ప్రముఖులతో భేటీ కావాల్సిందిగా మోదీ నుంచి మాట తీసుకున్నానని చెప్పారు. దక్షిణాది నుంచి రిప్రజెంటేటివ్ గా మీటింగ్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని, త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి చెప్పింది. కాగా, డైనమిక్, గౌరవనీయులైన ప్రధాన మంత్రిని కలిశామని, మోదీ నేతృత్వంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మోదీని కలిసిన కొద్ది సేపటికే ఆమె ఓ ట్వీట్ చేశారు.
Prime Minister
Narendra Modi
Artist
Manchu Laxmi

More Telugu News