BJP: బీజేపీ అగ్రనేతలను కలవడంపై వివరణ ఇచ్చిన మోహన్ బాబు

  • బీజేపీలోకి వెళ్లే విషయం చెప్పలేనని వెల్లడి
  • తిరుపతి రావాలని మోదీని కోరానని చెప్పిన మోహన్ బాబు
  • మోదీకి అలాంటి భేదాల్లేవని వ్యాఖ్యలు
సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఇవాళ ఢిల్లీలో వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. బీజేపీలోకి రావాలని మోదీ ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం మాత్రం చెప్పలేనని అన్నారు. అయితే తాను మాత్రం మోదీని తిరుపతి రావాలని అడిగినట్టు వెల్లడించారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని కోరినట్టు తెలిపారు. అంతేకాకుండా, కేవలం బాలీవుడ్ నటులతో మోదీ భేటీ కావడం పట్ల స్పందించాలని కోరగా, ఆయనకు అలాంటి భేదభావం లేదని స్పష్టం చేశారు.
BJP
Mohanbabu
New Delhi
Narendra Modi
Amit Shah

More Telugu News