Chandrababu: మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉంది: మంత్రి కన్నబాబు

  • చంద్రబాబుపై కన్నబాబు విమర్శలు
  • చంద్రబాబు మాయలో పడొద్దంటూ రైతులకు సూచన
  • తాము న్యాయ చేస్తామని భరోసా
ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై మంత్రి కన్నబాబు స్పందించారు. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమరావతిలో తన అనుచరుల పెట్టుబడులు పోతాయనే చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు.

మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిపై ఎందుకంత ప్రేమ, ఇతర ప్రాంతాలపై ఎందుకంత ద్వేషం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు అధికార ఉన్మాది అని ఆరోపించారు. గతంలో ఆయన అధికార ఉన్మాదంతో అరాచక చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తాము పూర్తి న్యాయం చేస్తామని, చంద్రబాబు మాయలో పడొద్దని అమరావతి రైతులకు సూచించారు.
Chandrababu
Kannababu
Andhra Pradesh
YSRCP
Amaravati

More Telugu News