Movie: సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో.. దేవిశ్రీ సెల్ఫీ నెంబర్ 1

  • వైరల్ గా మారిన దేవిశ్రీ, చిరు,మహేశ్ ల సెల్ఫీ ఫొటో
  • చిరంజీవి, హీరో మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్
  • ఈనెల 11న విడుదల కానున్న చిత్రం
‘సరిలేరు నీకేవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, హీరో మహేశ్ బాబులతో కలిసి దేవిశ్రీప్రసాద్ సెల్ఫీ దిగారు. 'ఈ సెల్పీ నెంబర్ వన్ సెల్ఫీ' అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ వేడుకను విజయవంతం చేసినందుకు దేవిశ్రీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, హీరో మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ‘సెల్ఫీ నెం.1 ఇది. ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సర్ కు ధన్యవాదాలు, ప్రియమైన మహేశ్, మీరు నా మీద ఉంచిన విశ్వాసం, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు.
Movie
Telugu
SarileruNeekevvaru
Pre Release
Devisri
Tweet
selfie no1

More Telugu News