Prime Minister: ‘వాట్ ఏ మ్యాన్! నరేంద్రమోదీ’: నటుడు మోహన్ బాబు

  • ఢిల్లీలో ప్రధాని నివాసానికి వెళ్లిన మోహన్ బాబు ఫ్యామిలీ
  • దాదాపు అరగంట పాటు సమావేశం
  •  మోహన్ బాబు, విష్ణు ట్వీట్లు
ప్రధాని మోదీని ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబు  తన కుటుంబసభ్యులతో కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణులు తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. ‘వాట్ ఏ మ్యాన్! నరేంద్రమోదీ’ అంటూ మోదీని ప్రశంసిస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.   మోదీతో తాను కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.

మంచు విష్ణు కూడా ఓ పోస్ట్ చేశారు. మోదీతో భేటీ బాగా జరిగిందని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ.. తన ట్వీట్ లో పేర్కొన్న మంచు విష్ణు, ప్రధానితో ఉన్న తమ ఫొటోలను జతపరిచాడు. ఇదిలా ఉండగా, బీజేపీలో చేరాలని మోహన్ బాబుకు ఆహ్వానం అందిన నేపథ్యంలోనే మోదీని కలిసినట్టు తెలుస్తోంది. 
Prime Minister
modi
Artist
Mohanbabu
Delhi

More Telugu News