YSRCP: చంద్రబాబు రైతులపై చూపిస్తున్నది నిజమైన ప్రేమ కాదు: మంత్రి శంకర్ నారాయణ

  • రైతులను బెదరించి భూములను లాక్కున్నారు
  • అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా సమర్థిస్తున్నారు  
  • రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు
అమరావతిలో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను కాపాడుకునేందుకే ఆందోళనల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుతూ టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూంటే.. రాయల సీమ టీడీపీ నేతలు మాత్రం అమరావతినే సదా వల్లిస్తున్నారన్నారు.

అనంతపురంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా సమర్థిస్తూంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, అతని సంబంధీకులు బినామీ పేర్లతో భూములు కొన్నారని విమర్శించారు. ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు.
YSRCP
Minister
Shanker Narayana
Chandrababu
Amaravati
Lands
Real estate
criticism

More Telugu News